Recent twitter entries...

జాతకం ఛెప్పబడును....

0
బ్రహ్మానందం:పాద సాముద్రిసకం, పాదములు ఛూసి జాతకం ఛెప్పబడును....
రాజెంద్ర ప్రసాద్: పాదం ఛూసి జాతకం ఛెప్తారా...........
బ్రహ్మానందం: స్రీదేవిది ఛూసాను,ఛిరంజీవిది ఛూసాను,విజయశాంతిది ఛూసాను.........
రాజెంద్ర ప్రసాద్:యేంటి..........?
బ్రహ్మానందం: పాదాలు బాబు, లెగ్స్ ఛూసాను.........
రాజెంద్ర ప్రసాద్: ఆ..... నేను వేరేయేదో అనుకున్నాలే........

గెలుపు!?

0
గంగూలి నాట్వెస్ట్ సీరియస్ గెలిచాడు, షర్టు విప్పాడు
ధోని టి20 వరల్డ్ కప్ గెలిచాడు, షర్టు విప్పాడు
సానియా వింబుల్డన్ ఏప్పుడు గెలుస్తుందో!

పిల్లి పాలు తాగిందండి

0
భార్య : ఏవండి మల్లి ఈ రోజు కూడా పిల్లి పాలు తాగిందండి
బర్త : ఆందుకే చెప్పాను రోజు బ్రా వేసుకొని పడుకోమని!


అనగనగా.....ఒక బీద కుటుంబం!?

0
బాగా ధనవంతుడైన ఒ సినిమా స్టార్‌ కొడుకుని స్కూల్లో ''బీద కుటుంబం'' అనే విషయం మీద వ్యాసం రాయమన్నారు.

ఆ కుర్రాడు ఇలా మొదలు పెట్టాడు.

''అనగనగా.....ఒక బీద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది, పిల్లలు కూడా అంతే.....

వాళ్ళ కారు డ్రైవరు...వాళ్ళ తోట మాలి, వంటమనిషి పాపం అంతా పేదవారే.

చివరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే నౌఖరు కూడా పేదవాడే.

ఒక రోజున వాళ్ళు పాపం.... తినడానికి తిండిలేక కారులో బయలుదేరారు.....''

పీడకలలు

0
జయమ్మః 'ఈ మధ్య రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!'

డాక్టర్‌: 'ఏ టైపు కలలు..'.

జయమ్మః ' నేనే వంట చేస్తున్నట్టూ... మా ఆయన సోఫాలో కూచొని నన్ను కాఫీ తెమ్మని కేకేసినట్టూ...' ఆందోళనగా వివరించింది జయమ్మ

అతి తెలివితేటలు

0
ఏ రూపంలో చర్యలు తీసుకుంటే డబ్బుఆదా అవుతుందో సలహాలు ఇవ్వాల్సిందిగా ఒక కంపెనీ ప్రకటించింది. ఉత్తమ సలహా ఇచ్చినవారికి 20 వేల రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామని కూడాప్రకటించింది.

రామారావు అతి తెలివితేటలు ప్రదర్శించి- బహుమతి మొత్తాన్ని పది వేల రూపాయలకు తగ్గించి డబ్బు ఆదా చేయవచ్చునని సలహా ఇచ్చి పది వేల రూపాయలు బహుమతిగా పొందాడు.

భారత స్త్రీ

0
భారత స్త్రీ - ముందు భర్తకు వడ్డించి, తరువాత తాను తింటుంది. గమనించారా? ప్రశ్నించాడు రావు - తన విదేశీ మిత్రుని.

బహుశా భోజనంలో హాని కలిగించే పదార్ధాలు ఏమైనా వున్నాయేమో తేల్చుకొని తినడం వారికి అలవాటు కాబోలు... !!అతితెలివిగా బదులిచ్చాడు ఆ విదేశీ మిత్రుడు.